సినిమా నా డీఎన్​ఏలోనే ఉంది..సితార ఎమోషనల్ పోస్ట్

నేషనల్​సినిమా డే(National Cinema Day)  సందర్భంగా మహేశ్​బాబు(Mahesh Babu)  కుమార్తె సితార(Sitara) పెట్టిన పోస్టు నెట్టింట వైరల్​గా మారింది. సినిమా తన జీవితంలో ఒక భాగమని..ఇది తన డీఎన్​ఏలోనే ఉందని తెలిపింది. సినిమా అనే పదానికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. నా డీఎన్‌ఏలో సినిమా ఒక భాగం.

లెజండరీ, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నా. మా నాన్న తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందినట్టుగానే నేను కూడా నాన్న నుంచి ప్రేరణ పొందాను..అని సితార తన పోస్ట్​లో తెలిపింది. ఇప్పటికే నటనపై తనకున్న ఇష్టాన్ని సితార బయటపెట్టింది. భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానని గతంలో పేర్కొంది.

ఒకప్పుడు తన తండ్రి మహేష్ బాబు తో కలిసి యాడ్స్ చేసిన సీతూపాప..ప్రస్తుతం సోలోగానే యాడ్స్ చేస్తుంది. రీసెంట్ గా ఓ ప్రముఖ జువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యి..కమర్షియల్ యాడ్ చేసింది.ఈ యాడ్ కోసం దాదాపు రూ.కోటి రెమ్యూనరేషన్ అందుకుంది. అయితే, అమౌంట్ మొత్తాన్ని ఛారిటీ కి ఇవ్వడం విశేషం.

చిన్నప్పటి నుంచే గొప్ప మనసు చాటుతున్న సితారకు మంచి ఫ్యూచర్ ఉందంటూ ఫ్యాన్స్  సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా తెలిపారు. ఎప్పటికప్పుడు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ అందరిచేత మన్ననలు పొందుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.