దగ్గుబాటి (Daggubati) వారింట పెళ్లి సందడి షురూ అయింది.విక్టరీ వెంకటేష్-నీరజల రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) వివాహం ఇవాళ (మార్చి 15న) జరగనుంది. ఈ వివాహ వేడుక రామానాయుడు స్టూడియోస్లో కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగబోతుందట.
అయితే హవ్యవాహిని మెహందీ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.ఈ మెహందీ ఈవెంట్లో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార అటెండ్ అయ్యారు. 'అందమైన జంట జీవితకాలం ఆనందం మరియు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ :- జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన ఆర్టీసీ బస్సు
గతేడాది అక్టోబర్ 25న హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక సింపుల్గా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు చిరంజీవి,మహేష్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లి వేడుక కూడా అంతకంటే ఎక్కువ సింపుల్గా జరుగబోతున్నట్లు తెలుస్తోంది.