
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పటివరకు చేయని పవర్ ఫుల్ పాత్రను SSMB 29లో చేస్తున్నాడు. హనుమంతుడి స్ఫూర్తితో మహేష్ బాబు పాత్రను దర్శకుడు SS రాజమౌళి (SS Rajamouli) డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్గా మహేష్ బాబు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జస్ట్ 14 సెకన్లు ఉన్న ఈ వీడియోలో మహేష్ బాబును చూస్తే జూలు విదిల్చిన సింహంలా వేటకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నాడు.
పొడవాటి జుట్టు పెరగడం మరియు కండలు తిరిగిన శరీరాకృతితో సహా అతను పూర్తి మేక్ఓవర్‌ని రెడీ చేసుకున్నాడు. మహేష్ కొత్త లుక్ సూపర్ ఫ్యాన్స్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఒక్క వీడియోనే సినిమాపై అంచనాలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదనే విధంగా ఉంది.
ఎందుకంటే, ఇదొక జస్ట్ ప్రాక్టీస్ లుక్ మాత్రమే. ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉండనుందో ఉహించుకుంటేనే విధ్వంసం అనేలా కనిపిస్తోంది. ఇకపోతే, ఈ భారీ ప్రాజెక్టుకు SS రాజమౌళి దర్శకత్వం వహించగా, విజయేంద్ర ప్రసాద్ రచన చేశారు.
SSMB29 బడ్జెట్:
దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
ఈ మూవీలో మహేష్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా(PriyankaChopra) కనిపిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడామె పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని కొత్త టాక్ మొదలైంది.
అంతేకాకుండా మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Babu 💥💥💥💥🔥🔥🔥🔥#SSMB29 pic.twitter.com/EBHjFmTKMA
— SSMB29 (@ssmb291_) February 27, 2025