![లీకైన గుంటూరు కారం వీడియో.. స్టైలీష్ లుక్లో అదరగొట్టిన మహేష్ బాబు](https://static.v6velugu.com/uploads/2023/09/Mahesh-Babu-guntur-kaaram_LPzYOlh5aw.jpg)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) అండ్ మీనాక్షి చౌదరి(Meenakshi choudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే గుంటూరు కారం నుండి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ గ్లింప్స్ లో మాస్ లుక్ లో మహేష్ అదరగొట్టేశాడు.
Also read :- OTTలో జైలర్ మేనియా.. ఏకంగా 36 దేశాల్లో దుమ్ములేపుతున్న రజినీకాంత్
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కొన్ని వీడియోస్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఏ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో మహేష్ గాగుల్స్ పెట్టుకొని స్టైలీష్ లుక్ లో అదరగొట్టేశాడు. బ్లాక్ గాగుల్స్ లో నడుస్తూ వస్తున్న మహేష్ వీడియో నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ జరిగిన షూటింగ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.
Content unnodiki Cutout chaalu ??#GunturKaaram pic.twitter.com/befXqcDrGR
— Guntur Kaaram ?? (@_ShyamReddyz) September 12, 2023
ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చైనా బాబు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Teddy gaadu Duty chesthe Never Before Numbers pedtadu pakka Regional wise ?⚡?#GunturuKaaram @urstrulyMahesh pic.twitter.com/5tin3MEMHX
— Guntur Kaaram ?? (@_ShyamReddyz) September 12, 2023