మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతికి కానుకగా.. థియేటర్లోకి వచ్చేసింది. రమణగాడులో ఎప్పుడు చూడని మహేష్ బాబు కనిపించాడా? అసలు గుంటూరు కారంలో ఘాటు ఎంత? త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తో ఫుల్ కామెడీ ఉంటుందా? త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించిందా? అసలు చిన్నప్పుడే మహేష్ బాబును రమ్య కృష్ణ ఎందుకు వదిలేసింది? వాచ్ దిస్ గుంటూరు కారం రివ్యూ..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే.. హై ఓల్టేజ్ ఎక్సపర్టేషన్స్ వచ్చేసాయి. అతడు, ఖలేజా తరువాత.. ఇద్దరి కలయిక కావడంతో.. సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బ్లస్టర్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోయారు. టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీతో పాటు.. కామెడీ ఉంటుంది కాబట్టి.. సినిమా హిట్టే అంటూ అంచనాలు పీక్స్ కు చేరాయి. మరోవైపు ట్రైలర్ లో మహేష్ బాబు.. స్టైల్, యాసలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అనుకున్నట్లగానే బాక్సాఫీసులను షేక్ చేసే సంక్రాంతికి పండక్కి గుంటూరు కారం సినిమా రిలీజ్ చేసారు మేకర్స్. జనవరి 12 అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం.. జాతరు మొదలైంది.
కథేంటంటే:
పదేళ్ల వయసులో కన్న కొడుకుని, కట్టుకున్న భర్తను.. వదిలి రమ్యకృష్ణ తండ్రి దగ్గరకు వెళ్లిపోవడంతో... కథ మొదలవుతుంది. తల్లి లేకపోవడంతో.. మేనత్త దగ్గరే పెరుగుతాడు మహేష్ బాబు. గుంటూరులో తండ్రి మిర్చి వ్యాపారం చూసుకుంటూ.. గుంటూరు కారం లెక్క పొగరుగా ఉంటాడు. అయితే.. చిన్నప్పుడు వదిలేసిన తల్లి రమ్యకృష్ణ మంత్రి అవుతుంది. తన ఆస్తిలో, రాజకీయ వారసత్వంలో కొడుకు మహేష్ బాబుకి ఎలాంటి హక్కు లేదని సంతకం పెట్టమని కబురు పంపుతాడు మహేష్ బాబు తాత ప్రకాష్ రాజ్. పేపర్స్ మీద సంతకం పెట్టించేపనిని లాయర్ మురళీ శర్మ కు అప్పగిస్తాడు. సంతకం కోసం.. లాయర్ కూతరు శ్రీలీల మహేష్ బాబును కాకపట్టే పనిలో.. ప్రేమలో పడుతుంది. అసలు వారసత్వం వదులుకోవాలని సంతకం ఎందుకు అడుగుతారు? తల్లి రమ్యకృష్ణ చిన్నప్పుడే ఎందుకు వదిలేసింది? రమ్యకృష్ణ రెండో పెళ్లి ఎందుకు చేస్కుంది? ఇదాంతా తెలియాలంటే.. గుంటూరు కారం చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే:
వన్ మ్యాన్ షోతో.. గుంటూరు కారం సినిమాను నడిపించాడు మహేష్ బాబు. పంచ్ డైలాగ్స్, ఫుల్ కామెడీతో నాన్ స్టాప్ నవ్వులు పండించాడు. ఐదు పదుల వయసుకు చేరువలో కూడా.. 30 యేళ్ల యువకుడిలా కనిపించి.. ఫ్యాన్స్ ను ఫిదా చేసాడు. ఇక ఈ సినిమాలో.. కెరియర్ లో మహేష్ బాబు ఎప్పుడూ చేయనంతగా.. స్టెప్పులు వేసి.. పూనకాలు తెప్పించాడు. వెన్నెల కిషోర్ తో.. మహేష్ బాబు చేసే కామెడీ సినిమాకు హైలెట్ అయ్యింది. శ్రీలీల, అజయ్, ఈశ్వరి రావులతో.. పంచ్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయి. ఇక శ్రీలీల ఎప్పటిలాగే గ్లామరస్ గా.. కనిపించి, కుర్రకారుకు మరోసారి కిక్కిచ్చింది. ఇక మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రామేష్, రాహుల్ రవీంద్రన్.. పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నీషియన్స్:
తమన్ సంగీతంలో గుంటూరు కారం సాగ్, కుర్చి మడతపెట్టి వంటి.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీన్స్ దగ్గర తమన్ నేపథ్య సంగీతం బాగుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, ఎస్ రాధా కృష్ణ నిర్మాణ విలువలు.. సినిమాకు ఏమాత్రం తగ్గలేదు. నవీన్ నూలి.. ఎడిటింగ్ బాగుంది. సీన్స్ షార్ప్ గా కట్ చేసాడు. ఇక టెక్నికల్ విషయాలు పక్కన పెడితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కథ, దర్శకత్వం ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రెండున్నరగంటల పాటు నడిపించాడు. అమ్మతనం అంటే.. అన్నం పెట్టి జోలపాడితేనే కాదని.. కంటికి కనిపించకుండా కూడా కొడుకు జాగ్రత్తగా చూస్కోవచ్చని చెప్పాడు త్రివిక్రమ్. కామెడీని పండించడంతో.. త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపించింది. డీసెంట్ కామెడీతో.. పంచ్ డైలాగ్స్.. పవర్ ఫుల్ గా పేలాయి.
చివరగా:
సినిమా బోర్ లేకుండా.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో సాగినప్పటకీ.. త్రివిక్రమ్ మార్క్ లేదంటూ సోషల్ మీడియాలో రచ్చ షురూ అయ్యింది. అత్తారింటికి దారేది, అజ్నాత వాసి.. వంటి సినిమాల కలయిక అంటూ.. త్రివిక్రమ్ పై విమర్శలు మొదలయ్యాయి. వీటన్నిటినీ పక్కనపెడితే.. కాస్త సెంటిమెంట్ తో నాన్ స్టాప్ కామెడీ కోసం.. గుంటూరు కారం చూడొచ్చు. ఇక రమణగాడి పాత్రలో మమేష్ బాబును చూడడం కోసం గుంటూరు కారం చూడాల్సిందే..