
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur kaaram). లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) హీరోయిన్స్గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన గుంటురు కారం మూవీ లాంగ్ రన్ లో రూ.231 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక గుంటూరు కారం థియేట్రికల్ రన్ ముగియడంతో..ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 9న) ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా గుంటూరు కారం టీం ట్వీట్ చేస్తూ..సర్రా సర్రా సూలం..రమణగాడి మాస్ జాతర మరో 12 గంటల్లో మీ ఇంట్లోకి వస్తుందంటూ తెలిపారు.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read: అఖండ సీక్వెల్కి రంగం సిద్ధమైందా!..అల్లు అరవింద్ అనౌన్స్మెంట్ ఎవరికోసం?
Experience the intense heat of Ramanagadi Mass striking into your living room in 12 Hours ??
— Guntur Kaaram (@GunturKaaram) February 8, 2024
Let’s all join in - Sarra Sarra Soolam ??#GunturKaaramOnNetflix ❤️? #GunturKaaram
Super ? @urstrulyMahesh ?
pic.twitter.com/xxmc9iZsjI
అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.
చాలా వరకు గుంటూరు కారం సినిమాకు మిక్సుడ్ టాక్ రావడంతో..థియేటర్ కు వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. కాబట్టి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా. మరి థియేటర్స్ లో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.