Gunturu Kaaram X Review: మొదలైన గుంటూరు కారం మాస్ జాతర.. సినిమా ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Gunturu kaaram). అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తరువాత ఈ కాంబో నుండి వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో.. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

భారీ అంచనాల మధ్య గుంటూరు కారం నేడు(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాత్రి ఒంటిగంట నుండే ప్రీమియర్స్ పడటంతో.. సినిమా చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి గుంటూరు కారం సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వస్తోంది అనేది ఇప్పడు తెలుసుకుందాం.

గుంటూరు కారం సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. రొటీన్‌ కథ అని, కొత్తగా ఏమీ లేదని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరేమో.. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ కు మాత్రం గుంటూరు కారం పక్కా ట్రీట్‌ అని, గురూజీ గత సినిమాలలగే కామెడీ, యాక్షన్‌, ఎమోషన్ అన్ని ఉన్నాయని, తమన్‌ తన బీజీఎం తో అదరగొట్టేశాడని కామెంట్స్ చేస్తున్నాటారు. ఓవర్ ఆల్ గా గుంటూరు కారం సినిమాపై ప్రేక్షకుల నుండి విశ్రమ స్పందన వస్తోంది.