Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో..యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..

Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో..యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలోని కుర్చీ మడత పెట్టి (Kurchi Madathapetti) ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసేసింది. రెండు నెలల క్రితం రిలీజైన ఈ సాంగ్ ఏకంగా యూట్యూబ్ లెక్కలు సరి చేస్తూ 200 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది.ప్రస్తుతం ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా కుర్చీ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఫస్ట్ హైయెస్ట్ వ్యూస్ కి వస్తే..మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లోని కళావతి సాంగ్ 245 మిలియన్ల వ్యూస్  పైగా సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

ప్రస్తుతం కుర్చీ సాంగ్ సరికొత్త లెక్కలు క్రియేట్ చేసే పనిలో ఉంది.ఈ వ్యూస్ రోజు రోజుకు మరింత పెరిగిపోతుంది.ఈ సాంగ్లో శ్రీలీల లంగావోణీలో కనిపించి హాట్ అప్పిరియ‌న్స్ తో యువ‌త‌ని కట్టిపడేసింది. అమ్మ‌డి న‌డుముమైపై మ‌హేశ్ చేతులు..క‌ళ్ల‌లో క‌ళ్లు మ‌స్త్గా హైలైట్ అయ్యాయి. ఎరుపు రంగు లంగా వోణీలో మ‌రింత స్పైసీగా ఆక‌ర్శించేలా..అమ్మ‌డి ముక్కుకి పుడ‌క‌..చెవుల‌కు జుంకాలు అన్ని శ్రీలీల‌ని యూత్ని ఆక‌ట్టుకునేలా చేశాయి.

సోషల్‌ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్‌ బీట్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ లవర్స్‌, సూపర్ ఫ్యాన్స్ ఈ పాటతో ఫుల్ స్వింగ్ లో ఊగారు. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కుపైగా రీల్స్‌ చేశారంటే క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమన్ మరోసారి తనలోని మాస్ బీట్స్ కు పనిచెప్పారు. ఈ పాటని సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..సాహితీ చాగంటి ,శ్రీ కృష్ణ పాడారు.