
మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి మొదటిసారిగా యాడ్లో నటించాడు. ట్రెండ్స్ యాడ్లో ఆయన తన కూతురు సితారాతో కలిసి చేసిన ఈ కొత్త యాడ్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ యాడ్లో, తండ్రీకూతుళ్లు షాపింగ్‌కు వెళ్లి, తిరిగి వచ్చినప్పుడు, సితార అతనికి Gen-Z లింగో భాషను నేర్పిస్తుంది. ఆ వెంటనే ఒకరి తర్వాత ఒకరి డ్రెస్లు మారుతుంటాయి.
మహేష్‌కు సితారా.. డ్రిప్, వైబ్, ఫ్యామ్ వంటి జెన్ జెడ్ పదాలను నేర్పింది. దీనితో ఆయన “అంటే ఇది ఫ్యామ్-జామా?” అని అడుగుతాడు. ఈ యాడ్లో వీరి సరదా సంభాషణ హాస్యాన్ని వ్యక్తపరిచేలా ఆహ్లాదకరంగా ఉంది. ఇందులో మహేష్ బాబు పొడవాటి జుట్టు గల లుక్‌లో కనిపించాడు.
తాజాగా ఈ వీడియోను మహేష్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ కోట యాడ్ కనువిందు చేస్తోంది. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సితార అదరగొడుతుంది అంటూ ఫ్యాన్స్ వీడియో షేర్ చేస్తున్నారు.
ALSO READ | Samantha: సమంతకు OTT అవార్డు.. ఎన్నోసార్లు 'స్పృహ కోల్పోయానంటూ' స్టేజీపై ఎమోషనల్
సితార ఇంతకుముందు మ్యూజిక్ వీడియోస్ మరియు యాడ్ లలో కనిపించింది. కానీ, ఫస్ట్ టైం తన తండ్రితో కలిసి ఒక యాడ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇకపోతే, గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట' సినిమాలో 'పెన్నీ' సాంగ్ లో స్టెప్పులేసింది.
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు 'SSMB 29' తో బిజీగా ఉన్నాడు, ఇది ఇండియన్ సినిమాలో రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ ఇతిహాసం. ఇందులో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ALSO READ | మళ్ళీ కలిసిన శుభలగ్నం జంట... హీరోయిన్ కి మేకప్ మెన్ గా మారిన హీరో జగపతి బాబు..
ఇటీవలే ప్రధాన తారాగణంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సహా కీలక సన్నివేశాలు ఒడిశాలో షూటింగ్ పూర్తి చేశారు. ఈ కథ కాశీ ఆధ్యాత్మిక నగరం నుండి ప్రేరణ పొందిందని, మహేష్ బాబు హనుమంతుడి ప్రేరణతో కూడిన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ ఉంది.