స్టంట్స్ ఇరగదీసిన మహేష్ బాబు మేనళ్లుడు.. వీడియో వైరల్

స్టంట్స్ ఇరగదీసిన మహేష్ బాబు మేనళ్లుడు.. వీడియో వైరల్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు(Mahesh babu), హీరో సుధీర్‌ బాబు(Sudheer babu) బావ, బావమరుదులు అన్న విషయం తెలిసిందే. మహేష్‌ చెల్లెలు ప్రియదర్శిని(Priyadarshini)నే సుధీర్‌ బాబు భార్య. ఈ జంటకు ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. వారి పెద్దబ్బాయి చరిత్‌ మానస్‌(Charith manas) కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రెండు మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించాడు కూడా.

అయితే ఈ అబ్బాయికి సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. చరిత్‌ అదిరిపోయే స్టంట్స్ చేస్తూ కనిపించాడు. అతి కష్టమైన ఆ స్టంట్లను చాలా ఈజీగా చేసేస్తూ ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. అల్లుడు మేనమామని(మహేష్ బాబు) మించిపోతున్నాడు. సూపర్ స్టార్ ఇంటినుండి మరో యాక్షన్ హీరో రెడీ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చరిత్ కు సంబందించిన ఈ వీడేమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.