ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు.. తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈలోపు ఆయన కొత్త లుక్‌తో అభిమానులను ఖుషీ చేశాడు.
ఈ సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది. లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్న మహేష్.. మీసాలు పెంచి, లైట్ గడ్డంతో ఫిట్‌గా ఉన్నాడు. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన మహేష్ న్యూ లుక్ చూసి సూపర్బ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆగస్టు 9 మహేష్ పుట్టినరోజున ఈ చిత్ర విశేషాలను తెలియజేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని, అన్ని అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ పార్ట్‌ను 2026 లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.