ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు SSMB 29 సినిమా కోసం యావత్ భారతీయ సినీరంగం ఎదురుచూస్తోంది. ఇక అందరి చూపులకు ఇవాళ ఎండ్ కార్డ్ పడింది. నేడు గురువారం నాడు (2025 జనవరి2న) SSMB 29 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. లాంచింగ్ వేడుకలో హీరో మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాతలతో పాటు పలువురు పాల్గొన్నట్లు సమాచారం.
అయితే, ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు రిలీజ్ కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు ఈవెంట్ కి వెళ్లే ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు సెంటిమెంట్:
సాధారణంగా మహేష్ బాబు తన సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. అతిధి మూవీ తర్వాత ఏ సినిమాకి ఆయన వెళ్ళిందే లేద నేది టాక్. అయితే, సెంటిమెంటుగా ఆయన తన సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు సితార లేదా గౌతమ్ లను మాత్రమే సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి పంపిస్తుంటారు. కానీ, ఇవాళ SSMB 29 కోసం తన సెంటిమెంట్ ని పక్కనపెట్టి ఈవెంట్కి వెళ్లడం మహేష్ ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపింది. దీన్ని బట్టి రాజమౌళిని మహేశ్ ఎంతలా నమ్మాడో అర్ధం చేసుకోవొచ్చు
SSMB29 బడ్జెట్:
దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించవచ్చని టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
#SSMB29 Exclusive Pooja Ceremony Place 😊#MaheshBabu𓃵 @urstrulyMahesh #SSMBxSSRGloryBegins pic.twitter.com/DNv19PC6gU
— 🇲🇦🇽 ᴰʰᶠᵐ 🦋 (@urstrulyMaxDHFM) January 2, 2025
మహేష్ బాబు పాత్ర:
ఇకపోతే.. SSMB 29లో హనుమంతుడి స్ఫూర్తితో మహేష్ బాబు పవర్‌ఫుల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. పొడవాటి జుట్టు పెరగడం మరియు కండలు తిరిగిన శరీరాకృతితో సహా అతను పూర్తి మేక్ఓవర్‌లో సిద్ధంగా ఉన్నాడు.
ALSO READ | OTT Movies: 2025 జనవరి ఫస్ట్ వీక్లో.. ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలివే
హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఆఫ్రికాలోని అద్భుతమైన లొకేషన్లను కూడా పరిశీలించారు. అన్ని కుదిరితే ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
Babu arrived @urstrulyMahesh 🦁❤️🔥 #SSMB29 #SSMBxSSRGloryBegins pic.twitter.com/os2XQ3Q4q4
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 2, 2025