![రాబిన్ హుడ్ సాంగ్ ను రిలీజ్ చేసిన మహేశ్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/mahesh-babu-released-the--nithin-robinhood-song_08LjIdoslW.jpg)
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వాలంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. బ్రాండ్‌ల క్రియేటివ్ మిక్స్, వాటి ఐకానిక్ ట్యాగ్‌లైన్‌ల ద్వారా నితిన్, శ్రీలీల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ డిఫరెంట్‌గా సాగిందీ పాట.
‘గుచ్చి బేబీ.. నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే.. లిటిల్ హార్ట్.. మరి గిచ్చి పోవద్దే.. లవ్ యూ రస్నా అంటూ నీ వెంటే పడ్డానే.. 90స్ కిడ్‌నే నేనేలే.. ఫస్ట్ లుక్‌తో ఆల్ అవుట్.. ఎనర్జీ అడగదా నిను బూస్టే.. అమూల్ బేబీలా కిస్ ఇస్తే.. టేస్ట్ నీది బెస్ట్.. వేర్‌ఎవర్ యూ గో .. ఐ ఫాలో’ అంటూ సాగిన నితిన్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్‌ను అందించగా, ఆర్మన్ మాలిక్ పాడిన తీరు ఆకట్టుకుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది.