Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేష్ ఫస్ట్ టాక్..ఆ మూడు సినిమాలే నన్ను నిలబెట్టాయి

టాలీవుడ్లో ప్రతి సంవత్సరం ఓ రెండు..మూడు పెద్ద మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో కొన్ని తమ అభిమాన నటుడు ఉండటం వల్ల, మరికొన్ని డైరెక్టర్కి ఉండే విజన్ వల్ల. కానీ, ఇప్పుడు మాట్లాడుకునే మేకర్స్ గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం. సినిమా రిలీజయ్యాక ఇంకో దశాబ్దం పాటు కూడా మాట్లాడుకోబోతున్నాం. వారెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu).

ఇండియానా జోన్స్ లైన్ లో సాగే ఓ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో వీరిద్దరి సినిమా రాబోతుంది. లేటెస్ట్ గా హీరో మహేష్ బాబు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చాడు.."డైరెక్టర్ రాజమౌళి సర్ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు చాలా బాగా సాగుతున్నాయి. త్వరలోనే మూవీని స్టార్ట్ చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను" అని మహేష్ అన్నారు. అలాగే తన కెరీర్ లో గుర్తింపుతో పాటు..మలుపు తిప్పిన సినిమాల గురించి అడగగా..

 "నా కెరీర్ ను మలుపు తిప్పిన మూడు సినిమాలు అంటే..అందులో మురారి, పోకిరి, శ్రీమంతుడు అనే చెబుతాను. ఇందులోని ప్రతి సినిమాలోనూ ఓ భిన్నమైన స్టోరీ టెల్లింగ్ చూశాను. అవి నన్ను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేలా చేశాయని" మహేష్ చెప్పుకొచ్చాడు.  అన్నాడు.

ఈ సినిమా షూటింగ్కి సంబందించిన లోకేషన్స్ వేట కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొత్తం వరల్డ్ వైడ్ గా మూడు దేశాల్లో షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచే మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది.అలాగే ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్బంగా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియో, కెఎల్ నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి. పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి మహేష్ తో సినిమాని ఏ రేంజ్లో చూపిస్తున్నాడో తెలియాలంటే ఇంకో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.!