బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన 'పోచర్’ ( Poacher) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నిమిషా సజయన్, రోషన్ మ్యాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను రిచీ మెహతా డైరెక్ట్ చేశారు.
తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పోచర్ రివ్యూ ఇచ్చాడు. మహేష్ మనసును కొల్లగొట్టిన ఈ మలయాళ వెబ్ సిరీస్ పోచర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకి వచ్చింది.
ప్రస్తుతం హీరో మహేష్ బాబు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తనకు నచ్చిన సినిమాలను, వెబ్ సిరీస్ లను మహేష్ చూడడమే కాకుండా..వాటికి తనదైన రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన లేటెస్ట్ వెబ్ సీరిస్ పోచర్ మహేష్ మనసుకి నచ్చేసింది. అలాగే తనలో పలు ప్రశ్నలు..ఎమోషన్స్ కూడా ఈ సిరీస్ రేకెత్తించింది.
లేటెస్ట్గా హీరో మహేష్ పోచర్ సినిమా అనుభవాన్ని పంచుకుంటూ..'ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో అసలు హ్యుమానిటీ అనేది ఉండదా..? ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరు పోరాడాలి” అంటూ మహేష్ రాసుకొచ్చాడు.దీంతో ఈ సీరిస్ చూడటానికి ఆయన ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో మనసు కొల్లగొట్టిన ఈ సీరీస్..ముందు ముందు ఎలాంటి రికార్డ్లు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Superstar @urstrulyMahesh shares thoughts on #Poacher…..A gripping tale about the largest ivory bust in Indian history!!#PoacherOnPrime #SSMB #MaheshBabu pic.twitter.com/TEyhO2PzRF
— Mahesh Babu Space (@SSMBSpace) February 27, 2024
ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఒకటైన ఈ ఏనుగు దంతాల వ్యాపారం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 1990ల నుంచి సైలెంట్గా ఉన్న ముఠా మళ్లీ యాక్టివ్ అవ్వడం..ఏనుగు దంతాల వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు, లోకల్ పోలీసులు, ఎన్‌జీవో వర్కర్స్ కలిసి ఎలా పట్టుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్ తో వచ్చింది.మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ అవుతుంది.