![వైరల్ అవుతున్న మహేష్ బాబు షర్ట్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!](https://static.v6velugu.com/uploads/2023/08/Mahesh-Babu-shirt-at-recent_g7tumy4rcY.jpg)
టాలీవుడ్ మోస్ట్ స్టైలీష్ ఐకాన్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఒకరు. ఆయన చేసే సినిమాల్లోనే కాదు ఏదైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ కు అటెండ్ అయినప్పుడు కూడా తన స్టైలింగ్ చాల సింపుల్ అండ్ ఐకానిక్ గా ఉండేలా చూసుకుంటారు. తాజాగా ఆయన వేసుకున్న షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు బిగ్ సి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన బిగ్ సి ఇరవై ఏళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ గా మహేష్ వేసుకున్న షర్ట్ అందరి దృష్టికి ఆకర్షించింది. అందుకే ఆ షర్ట్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చేయించారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. అదొక ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించిందిగా తెలుస్తోంది. దాని ధర అక్షరాల పద్దెనిమిది వేలు. బ్లాక్ కలర్ చెక్స్ తో చాలా సింపుల్ గా ఉన్న ఈ షర్ట్ ఖరీదు తెలుసుకొని షాకవుతున్నారు నెటిజన్స్.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.