బిగ్ బాస్ లోకి మహేష్ బాబు మరదలు...

బిగ్ బాస్ లోకి మహేష్ బాబు మరదలు...

హిందీలో ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ గేమ్ షో ని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం తదితర భాషలలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే హిందీలో బిగ్ బాస్ షో 17 సీజన్లు పూర్తీ చేసుకుని 18వ సీజన్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో కూడా బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 

దీంతో షో నిర్వాహుకులు కంటెస్టెంట్లని బిగ్ బాస్ హౌస్ లోకి పిలిచారు. ఈ క్రమంలో హిందీ ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ మొదటి కంటెస్టెంట్ గా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా నటి శిల్పా శిరోద్కర్ హిందీలో దాదాపుగా 20కి పైగా చిత్రాల్లో నటించింది. 

ALSO READ | మరీ టూ మచ్ కదా : బిగ్బాస్ హౌస్ లోకి గాడిద.. కంటెస్టెంట్గా ఎంట్రీ.. షాకిచ్చిన సల్మాన్ ఖాన్!

అలాగే 4కి పైగా సీరియల్స్ లో నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో శిల్పా శిరోద్కర్ రోజుకి 5 నుంచి 7 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. 

అయితే శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కి సోదరి. అంతేగాకుండా నమత్ర శిరోద్కర్ కంటే ముందుగానే శిల్పా శిరోద్కర్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో మంచు మోహన్ బాబు హీరోగా నటించిన బ్రహ్మ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో నటించలేదు.