Mahesh Babu: మహేష్‌‌‌‌ వారసులు రెడీ.. సితార, గౌతమ్ల యాక్టింగ్ వీడియోస్ వైరల్

Mahesh Babu: మహేష్‌‌‌‌ వారసులు రెడీ.. సితార, గౌతమ్ల యాక్టింగ్ వీడియోస్ వైరల్

సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌ కృష్ణ నట వారసుడిగా పరిచయమైన మహేష్‌‌‌‌ బాబు.. ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌గా ఎదిగాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌‌‌‌లో పాన్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. తాజాగా ఓ క్లాతింగ్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌కు సంబంధించిన యాడ్‌‌‌‌లో తండ్రితో కలిసి నటించి సర్‌‌ప్రైజ్ చేసింది సితార.

ఇదిలా ఉంటే మహేష్‌‌‌‌ బాబు కొడుకు గౌతమ్ కూడా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. న్యూయార్క్‌‌‌‌లోని ప్రతిష్టాత్మకమైన ఎన్‌‌‌‌వైయు టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌‌‌‌లో ప్రస్తుతం యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెరాఫీనా జేరోమి రూపొందించిన ఈ వీడియోలో గౌతమ్, కాశ్వీరమణ నటించారు. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్‌‌‌‌ డిన్నర్ చేస్తున్న సీన్‌‌‌‌లో డిఫరెంట్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌తో సాగిన గౌతమ్‌‌‌‌ మైమ్‌‌‌‌ షో ఆకట్టుకుంది.

తన యాక్టింగ్ టాలెంట్ చూసిన అభిమానులంతా సినిమాల్లో ఎప్పుడు కనిపించబోతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు యాక్టర్స్‌‌‌‌ సిల్వర్ స్క్రీన్‌‌‌‌ ఎంట్రీకి రెడీ అయ్యారు.