Mahesh Babu Son: తండ్రికి తగ్గ తనయుడు.. యాక్టింగ్‌తో అదరగొట్టిన గౌతమ్‌ ఘట్టమనేని.. వీడియో వైరల్‌

Mahesh Babu Son: తండ్రికి తగ్గ తనయుడు.. యాక్టింగ్‌తో అదరగొట్టిన గౌతమ్‌ ఘట్టమనేని.. వీడియో వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్, ప్రముఖ న్యూయార్క్ యూనివర్సిటీలో (NYU)యాక్టింగ్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే.  లేటెస్ట్ గా గౌతమ్ యాక్ట్ చేసిన ఓ వీడియో గ్లింప్స్ బయటికి వచ్చింది. ఒక ఫ్యాన్ క్లబ్ షేర్ చేసిన వీడియోలో, అతను తన బ్యాచ్‌మేట్‌లలోని ఒక అమ్మాయితో కలిసి స్కిట్ ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో ఓ కామెడీకి సంబంధించిన స్కిట్లో గౌతమ్ ఇచ్చే హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా గౌతమ్ ఇచ్చిన ఎక్సప్రెషన్స్, యాక్షన్, ఎమోషన్ అదిరిపోయాయి. ఈ వీడియోతో తన యాక్టింగ్ పట్ల గౌతమ్ ఎంతటి అంకితభావంతో ఉన్నాడో అర్ధమైపోతుంది. ఇప్పుడు ఈ వీడియో సూపర్ స్టార్ ఫ్యాన్స్ని అలరిస్తోంది. దాంతో గౌతమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ALSO READ : AI Generative: AI బారిన పడకుండా చట్టపరమైన చర్యలకు బాలీవుడ్ సై.. మరి సౌత్ ఇండస్ట్రీకి ఏమైంది?

గౌతమ్‌ యాక్టింగ్‌ భలే చేస్తున్నాడంటూ సోషల్ మీడియా పోస్టులతో పిచ్చెక్కించేస్తున్నారు. సూపర్ స్టార్ వారసుడు అంటే.. ఈ మాత్రం ఉండాలి కదా.. అంటూ గౌతమ్ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు వీడియో చూసేయండి. 

గౌతమ్ ఘట్టమనేని గత సంవత్సరం (2024) ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంవత్సరం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ కోర్స్లో చేరాడు.  ఆ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్రామా కోర్సును అభ్యసిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను ముగించింది. జక్కన్న SSMB 29ను పురాతన నగరం వారణాసి యొక్క మూలాన్ని అన్వేషిస్తూ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.