
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అనౌన్స్ మెంట్ నుండే ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. SSMB 29'వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే తీరిక దొరికినప్పుడల్లా ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళే మహేష్ బాబు, ఇటీవల ఇటలీకి వెళ్లారు. రోమ్ వెకేషన్ను పూర్తిచేసుకుని మంగళవారం ఏప్రిల్ 15న తిరగొచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Super star @urstrulyMahesh is back from Italy trip!!😎#MaheshBabu | #SSMB29 pic.twitter.com/vhWsQ2Fov5
— VardhanDHFM (@_VardhanDHFM_) April 15, 2025
లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే..
ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ నుంచి సాలిడ్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడట జక్కన్న. ఇప్పటివరకు బయటకు వచ్చిన లుక్, లోకేషన్, వైరల్ అయ్యిన విజువల్స్ కాకుండా.. రాజమౌళి మేకింగ్ స్పెషల్ విజన్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారట. ఈ గ్లింప్స్‌లో మహేష్ బాబు లుక్‌తో పాటు సినిమాలో ఉండే అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ని కూడా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:- దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్.. AI ఆధారిత స్టూడియోకి శ్రీకారం..
ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సైతం విదేశాల్లోనే ఉన్నారు. రీసెంట్ గా 'RRR అండ్ బియాండ్' డాక్కుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన జక్కన్న రెండు, మూడు రోజుల్లోనే తిరిగి రానున్నారు. దీంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది.
పక్క ప్లానింగ్తో, పకడ్బందీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి, ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లోనూ ఈ మూవీ షూటింగ్కు ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
దుర్గా ఆర్ట్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో SSMB29 నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు.. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం ఈనెల 26న రీ రిలీజ్ అవుతోంది.
SSMB29 కథ:
SSMB29 సినిమా కథ.. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట. అడ్వెంచర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.