గుంటూరు కారంలో ఐటమ్ సాంగ్.. స్టార్ హీరోయిన్ని రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఇక చాలా రోజుల తరువాత, మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా కావడంతో..ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

లేటెస్ట్గా గుంటూరు కారంలోని ఐటెం సాంగ్ పై చర్చ నడుస్తుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా..సాంగ్స్ ఏ రేంజ్లో ఉండబోతాయనే.. ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ మసాలా ఐటెం సాంగ్  ఉండేలా ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ఈ మేరకు ఓ స్టార్ హీరోయిన్ ని మహేష్ కోసం రంగంలోకి దించుతున్నారట. అయితే, ఈ సాంగ్ పై ఆఫీసియల్ అప్డేట్ రాకపోయినప్పటికీ..త్రివిక్రమ్ మాత్రం ఈ సాంగ్ థియటర్స్లో ఆడియన్స్ కి..కారం ఘాటు చూపించేలా ప్లాన్ చేశాడని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అంతేకాకుండా..ఈ విషయాన్ని సినిమా రిలీజ్ వరకు సీక్రెట్గా ఉంచాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్. అంతవరకు ఎటువంటి పోస్టర్ గానీ, ఐటెం సాంగ్ హింట్స్ గానీ రిలీజ్ చేయకుండా..నేరుగా థియేటర్స్లోనే ఆడియన్స్ చేత ఈలలు పెట్టించాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యారట.

మహేష్కు జోడీగా శ్రీలీల(Sreeleela) కెమిస్ట్రీ..ఈ సినిమాకు హైలైట్‌ కాబోతున్నట్లు టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) నటిస్తుంది. జగపతి బాబు విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, రఘుబాబు, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు జయరామ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గుంటూరు కారం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.