Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే

Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్లో సూపర్​స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతా శిరోద్కర్ ఎప్పుడు ముందుంటారు. ఇవాళ బుధవారం (జనవరి 22న) మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన 53వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా ఆమెకు మహేష్ బాబు (Mahesh Babu) ప్రత్యేకంగా బర్త్డే విషెష్ తెలిపాడు. నమ్రతపై తనకున్న ప్రేమను X ద్వారా చాటుకున్నాడు. " హ్యాపీ బర్త్ డే NSG (నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని)! నా జీవితంలో ప్రతి రోజును ప్రకాశవంతంగా, నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. సమాజంలో మీరెప్పుడు అద్భుతమైన మహిళగా రాణిస్తారు " అంటూ మహేష్ ఫోటో షేర్ చేశాడు. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే 'నమ్రతా మహేష్' అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. 

మహేష్ బాబుతో పాటు కుమార్తె సితార ఘట్టమనేని కూడా విషెష్ తెలిపింది. తన తల్లితో కలిసి ఉన్న ఓ అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి "జస్ట్ లవ్, లవ్, లవ్ యు, మరియు నేను నిన్ను నా అని పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్న. అమ్మా, మీరు ప్రపంచానికి గొప్ప మహిళగా అర్హులు. అమ్మా, మీరెప్పుడు ఇలానే హ్యాపీగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ సితార తెలిపింది. ఈ పోస్ట్‌పై నమ్రత స్పందిస్తూ "లవ్ యు మై పప్లూ" అని రిప్లై ఇచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sitara (@sitaraghattamaneni)

ఇకపోతే మొదటి సారి ‘వంశీ’ సినిమాలో మహేష్,నమ్రతాలు ఆన్‌ స్క్రీన్‌ జోడీగా చేశారు. ఆ తర్వాత నిజజీవితంలో కూడా ఒక్కటైయ్యారు. 1993లో ఫెమీనా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై ,చెప్పింది. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.