టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహబంధంలోకి అడుగు పెట్టి ఇవాళ్టితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ తన భార్య నమ్రతా శిరోద్కర్ కు ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లో పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెప్పారు. తమ బంధం జీవితాంతం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరారు. ఇన్ స్టాగ్రమ్ లో నమ్రతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మహేశ్ తమ వివాహబంధంపై స్పెషల్ పోస్ట్ చేశారు.
‘18 సంవత్సరాలుగా కొంచెం క్రేజీగా, చాలా ప్రేమగా గడిపాం. ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నమత్రా శిరోద్కర్ ఘట్టమనేని’ అంటూ మహేశ్ విషెస్ తెలిపారు. దీనికి నమ్రత కూడా మహేశ్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఐ లవ్ యూ టూ అంటూ రిప్లై ఇచ్చారు. అంతేగాకుండా 18 ఏళ్ల క్రితం తాము తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనంటూ వెల్లడించారు. వంశీ సినిమాతో ప్రేమలో పడ్డ మహేశ్,నమ్రత 2005లో ఒక్కటయ్యారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.