టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం విభిన్న జోనర్ల కథనాలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తుంటాడు. ఇప్పటివరకూ సందీప్ రెడ్డి తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెద్ద మొత్తంలోనే సంపాదించుకున్నాడు.
అయితే సందీప్ రెడ్డి బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేయగా దాదాపుగా రూ.917 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి యానిమల్ చిత్రం కంటే ముందు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ పెట్టి కథ కూడా మహేష్ కి వినిపించాడు. కానీ ఈ స్టోరీ బొల్డ్ మరియు మాస్ గా ఉండటంతో మహేష్ నో చెప్పాడని గతంలో ఓ సందర్భంలో సందీప్ రెడ్డి తెలిపాడు.
దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ నెటిజన్ మహేష్ లుక్ తో ఓ పోస్టర్ ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ పోస్టర్ లో డెవిల్ టైటిల్ తో మహేష్ వింటేజ్ కారుపై కూర్చుని రక్తం మరకలతో కనిపిస్తున్నాడు. దీంతో కొందరు మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. సినిమా అయితే ఆగిపోయింది కానీ డెవిల్ చిత్రాన్ని మహేష్ బాబు చేసి ఉంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగులో ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎమ్బీ29 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెలలో మొదలు కానుందని aఅ మధ్య ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు.