గర్వంతో ఉప్పొంగిపోయా.. టీమిండియా విజయంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

గర్వంతో ఉప్పొంగిపోయా.. టీమిండియా విజయంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‎ను మట్టి కరిపించి టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‎కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ALSO READ | IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ మనదే.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రిన్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మ్యాచ్ చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయా. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు టీమిండియాకు భారీ అభినందనలు. నిజమైన ఛాంపియన్ మన టీమ్ ఇండియా’’ అంటూ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‎కు శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. తుది సమరంలో కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకముందు 2013 లో ధోనీ కెప్టెన్సీలో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది.

ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.