సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Gunturu kaaram). స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్(Harika hassine creations) పై చినబాబు(Chinnababu) నిర్మిస్తున్నారు. మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హైట్రిక్ సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి నుండి ఆలస్యం అవుతూ వస్తోంది. మొదట్లో కొన్నిరోజులు షూట్ చేసి కథ మారిందని ఆపేశారు. ఆ తరువాత కూడా పలుమార్లు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ సజావుగా సాగుతుంది అనుకునే క్రమంలో.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఒకటి సూపర్ స్టార్ అభిమానులను కలవర పెడుతోంది.
అదేంటంటే.. గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడనుందట. దానికి కారణం మహేష్ బాబు విదేశీ ప్రయాణమే. అసలు విశయం ఏంటంటే.. మహేష్ బాబు కుమారుడు గౌతమ్(Gautham) లండన్ లో చదువుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహేష్ గౌతమ్ తో కలిసి జులై 19న లండన్ వెళ్లనున్నారట. దీంతో గుంటూరు కారం షూటింగ్ ను మరోసారి పోస్ట్ పోన్ చేశారట మేకర్స్.
ఇక ఈ వరుస పోస్ట్ పోన్ లతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారట. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. అందులో ఈ పోస్ట్ పోన్ లు. ఇలా అయితే సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేము ఎప్పుడు చూస్తామన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికైతే ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. మరి వాయిదాల వల్ల అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.