అతడు వరల్డ్ రికార్డ్.. థియేటర్స్ లో వర్కౌట్ కాలేదు కానీ అందులో బాగానే చూస్తున్నారట..

అతడు వరల్డ్ రికార్డ్.. థియేటర్స్ లో వర్కౌట్ కాలేదు కానీ అందులో బాగానే చూస్తున్నారట..

అతడు.. అతడు.. అతడు.. నెలలో ప్రతి వారం వీకెండ్ స్టార్ మా ఛానెల్ లో మహేష్ బాబు అతడు మూవీ టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. యూట్యూబ్ లో కూడా టాప్ మూవీస్ అని కొడితే  అతడు వస్తది.. ఓటీటీలో టాప్ వ్యూస్ మూవీ అని కొడితే అతడే వస్తది.. 

అలా ఇలా కాదు.. అతడు మూవీ వచ్చి 20 ఏళ్లుగా అవుతున్నా.. ఇప్పటికే 15 వందల సార్లు.. అవును.. మీరు చదివిందే నిజమే.. అక్షరాల 15 వందల సార్లు ఈ మూవీని టీవీల్లో ప్రసారం చేశారు.. అయినా జనం బోరు కొట్టకుండా చూస్తూనే ఉన్నారు.. మొన్ననే కదరా అతడు మూవీ వేశాడు.. మళ్లీ వేస్తున్నాడా అని అనుకుంటున్నానే ఉంటారు ప్రేక్షకులు.. అయినా కూడా అతడు సినిమానే చూస్తూ ఉన్నారు.. ఇప్పుడు అతడు మూవీ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. భూ మండలంపై ఏ సినిమా సృష్టించిన చరిత్రను మహేష్ బాబు అతడు మూవీ సృష్టించింది.

అతడు సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు..  కానీ టెలివిజన్ ఛానెల్ లో మాత్రం బాగానే వర్కౌట్ అయ్యింది. అంతేకాదు అత్యధికంగా టెలివిజన్ ఛానెల్ లో ప్రసారం చేసిన సినిమాలలో అతడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మాములుగా సినిమాలని కొన్ని టీవీ ఛానెల్స్ ఏదైనా సినిమాని వెయ్యి సార్లు కంటే ఎక్కువగా ప్రసారం చెయ్యలేవు. ఎందుకంటే టీఆర్ఫీ రేటింగ్, వ్యూయర్ షిప్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొన్నేళ్ల తర్వాత ప్రసారం చెయ్యడం నిలిపి వేస్తుంటారు.. 

ALSO READ | Court Box Office: నాని మూవీకి లాభాల వర్షం.. ఐదు రోజుల కలెక్షన్లు ఇవే..

కానీ అతడు సినిమా మాత్రం ఇప్పటివరకూ 15 వందలసార్లు ప్రసారం చేశారు. అలాగే ఈ సినిమాని ఎప్పుడు ప్రసారం చేసినా మంచి రెస్పాన్స్ వస్తోంది.  బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం బాగానే ఆకట్టుకుంది దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న SSMB29లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.