మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. విచారణ స్పీడప్

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. విచారణ స్పీడప్

హైదరాబాద్: మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. హ్యాకింగ్ ఎలా చేశారు.. లోపాలు ఎక్కడున్నాయి.. అసలేం జరిగిందన్న వివరాలు రాబట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక పరిజ్ఘానాన్ని ఉపయోగించి కేసు పరిశోధన చేపట్టారు.  బ్యాంక్ సర్వర్ పై ఇతర దేశాల ఐపీలతో పాటు హైదరాబాద్ కు చెందిన ఐపీలను హ్యాకర్లు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో రెండు ఇంటర్నెట్ సెంటర్ల ఐ.పిలను వాడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నగదు బదిలీ అయిన 129 బ్యాంక్ అకౌంట్స్ లలో 40 బ్యాంక్ అకౌంట్స్ ఢిల్లీలోనే ఉండటంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఈ అకౌంట్స్ కి సంబంధించిన వారిని విచారిస్తే మరింత సమాచారం రావచ్చని భావిస్తున్నారు పోలీసులు. బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్న వారి వివరాలు తెలుసుకుని విచారిస్తే.. కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ