బోధన్,వెలుగు : పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలోని కొండయ్యచౌదరి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంను బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన మహేశ్ మంగళవారం రాత్రి పగలగొట్టాడు. ఏటీఎంలో నుంచి డబ్బులు రావడంలేదని ఈ పని చేశాడు .
పెట్రోల్ బంక్‌లో ఉన్నా వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ వీరయ్య ఘటన స్థలానికి చేరుకొని మహేశ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.