మళ్ళీ వెకేషన్ కి మహేష్.. ఆగ్రహంలో ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత మూవీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా స్టార్ అయ్యింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అప్పట్లో కొంత భాగం షూట్ చేశారు. కానీ.. కథ మారిందని ఫుటేజ్ అంతా పక్కన పడేసారు. దీంతో దాదాపు 6 నెలల  సమయం వృధా అయ్యింది.

అసలు సినిమా ఉంటుందా? ఉండదా? అంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు మహేష్ ఫ్యాన్స్. ఇవన్నీ గమనించిన మేకర్స్ తాజాగా సినిమా నుండి మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారూ. అది చూసిన మహేష్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ.. ఈ సినిమా  షూటింగ్ మల్లి ఆగిపోయిందట. ఈ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కి కూడా వెళ్ళాడు. దీనికి సంబందించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో.. మహేష్ ఫ్యాన్స్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో టీజరో, లేదా టైటిల్ అంనౌన్స్మెంటో ఉంటుంది అనుకునే టైంలో షూటింగ్ నిలిచిపోవడం ఏంటన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ గ్యాప్ తరువాతైనా.. షూటింగ్ రెగ్యులర్ లా సాగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.