సుప్రీం కోర్టుకు వెళ్లినా KTR తప్పించుకోలేడు: మహేష్ గౌడ్

సుప్రీం కోర్టుకు వెళ్లినా KTR తప్పించుకోలేడు: మహేష్ గౌడ్

నిజామాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని.. ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే కేసు నమోదు చేసిందని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్.. ఇప్పుడు మాట మార్చుతున్నారని ఫైర్ అయ్యారు.  ఇక, గాంధీ భవన్, బీజేపీ స్టేట్ ఆఫీస్‎పై దాడి ఘటనలపైన ఆయన స్పందించారు. 

ALSO READ | Formula E Car Race Case : పైసా అవినీతి చేయలేదు.. రేవంత్ ఇంట్లో చర్చకు సిద్ధం: కేటీఆర్

రాజకీయాల్లో ఒకపార్టీ ఇంకో పార్టీ కార్యాలయంపై దాడులు చేసే సంస్కృతి సరికాదని అన్నారు. ప్రియాంక గాంధీ‎పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివని.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ బీజేపీ ఆఫీసుపై దాడి చేయడం సరికాదని.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపాలని సూచించారు. అలాగే.. గాంధీ భవన్‎పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమ పార్టీ నేత  చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించ్చాల్సిన కేంద్ర  మంత్రి కిషన్ కిషన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.