వినయ్ భాస్కర్ అనుచరులను అరెస్ట్ చేయాలె: మహేష్ కుమార్ గౌడ్

వినయ్ భాస్కర్ అనుచరులను అరెస్ట్ చేయాలె: మహేష్ కుమార్ గౌడ్

వరంగల్‭లో యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై దాడిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు పవన్ పై కిరాతకంగా దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై పోస్టర్లు అతికిస్తుంటే ఎలా దాడి చేస్తారని.. పోలీసులకు ఇదంతా కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రతిదాడులకు దిగితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. అటెంప్ట్ మర్డర్ కింద వినయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 

దళిత ఎమ్మెల్యే సాయన్నకు చావులో కూడా బాధను మిగిల్చారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు అంటే గౌరవం లేదన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన దళిత వ్యక్తికి గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా అని మహేష్ కుమార్ ధ్వజమెత్తారు