హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ విధానాలు నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పోచారం ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరని చెప్పారు.
బయటి పార్టీల నేతలు చేరుతున్నా..నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమాత్రం అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో కార్పోరేషన్ పదవుల నియమకాలకు సంబంధించిన జీవోలు రానున్నాయని వెల్లడించారు.