![ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ దోస్తీ : మహేశ్ కుమార్ గౌడ్](https://static.v6velugu.com/uploads/2025/02/mahesh-kumar-goud-said-that-brs-bjp-had-entered-into-a-fraudulent-agreement-in-the-mlc-elections_yOkG7w6MSc.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఓప్పందం కుదుర్చుకున్నాయని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరే బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అని అన్నారు
బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీగా మారిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్ట మొదటి సారిగా తెలంగాణలో కుల గణన సర్వే నిర్వహించామని చెప్పారు. కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు.
Also Read : సన్న వడ్ల బోనస్ డబ్బులు ఎప్పుడిస్తరు
బీఆర్ఎస్ లో కేటీఆర్ , కవిత, హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌస్ లో సేద తీరుతున్నారని ఫైర్ అయ్యారు మహేశ్ కుమార్ .