కాంగ్రెస్​ను పవర్​లోకి తేవడమే లక్ష్యం : మహేశ్​​కుమార్​గౌడ్

నిజామాబాద్, వెలుగు : ఎలక్షన్​లో ఎవరు పోటీ చేయాలనే  విషయాన్ని డిసైడ్​ చేసేది పార్టీ అధిష్ఠానమని,  ఆ విషయాన్ని పక్కనబెట్టి  కాంగ్రెస్​ను పవర్​లోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​​కుమార్​గౌడ్ కోరారు. సోమవారం ఆయన కొత్తగా అపాయింటైన మండల, బ్లాక్​కాంగ్రెస్​ ప్రెసిడెంట్లతో డీసీసీ ఆఫీస్​లో మీటింగ్​నిర్వహించి మాట్లాడారు. ఎవరు పార్టీలోకి రావాలన్నా, తలుపులు తెరిచే ఉంటాయన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉంటాయన్నారు. గ్రూపులు కట్టేవారిని బయటకు పంపుతామని వార్నింగ్​ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు మోహన్​రెడ్డి, అనుబంధ సంఘాల లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్​గౌడ్, విక్కీయాదవ్, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.