కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు..మెగా హెల్త్ చెకప్ లాంటిది : మహేశ్ కుమార్ గౌడ్

కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు..మెగా హెల్త్ చెకప్ లాంటిది :  మహేశ్ కుమార్ గౌడ్

కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రియార్టీ సబ్జెక్ట్ గా తీసుకుందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.   కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు  మెగా హెల్త్ చెకప్ లాంటిదన్నారు . కులగణనపై గాంధీభవన్ లో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  జోడో యాత్రలో రాహుల్ అన్ని పరిస్థితులు  చూశారు...  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేయాలని నిర్ణయించారు.  కులగణన నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు మహేశ్. నవంబర్ 2న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో  సమావేశం నిర్వహిస్తామన్నారు.  ఈ సమావేశాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తామని తెలిపారు.   

 డిసెంబర్ 7  నాటికి కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతుందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ఆలోపు సమగ్ర కులగణన సర్వేను హైకోర్టుకు అందిస్తామన్నారు.  రాహుల్ ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామన్నారు.  రాహుల్ ప్రధాని కావడానికి తెలంగాణ మోడల్ ఉపయోగపడుతుందన్నారు మహేశ్ .   నవంబర్ 31 లోగా కులగణన పూర్తి చేస్తామన్నారు మహేశ్ 

Also Read :- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

కులగణనపై  నవంబర్ 5  లేదా 6 న రాస్ట్ర స్థాయి సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని వర్గాల ప్రజలను   భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు.   కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ కులగణను చేర్చాలని కోరుతామన్నారు. ప్రభుత్వ ఆదాయన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచుతామని చెప్పారు మహేశ్ కుమార్ గౌడ్.