నిజమాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన సెటైర్ వేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ అవుతుండటం కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని మహేష్ కుమార్ కేటీఆర్ ను హెచ్చరించారు.
ALSO READ | మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
మూసి ప్రక్షాళనపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ఒక డ్రామా అని మహేష్ కుమార్ చెప్పారు. మూసీ ప్రక్షాళనకు డిపిఆర్ కాకముందే రూ.లక్ష కోట్లు బడ్జెట్ అని అంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. దామగుండం రాడార్ స్టేషన్ పై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని TPCC ప్రెసిడెంట్ అన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టే సహకరిస్తున్నామని వివరించారు.