TPCC బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా  బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. రేవంత్ రెడ్డి నుంచి సెప్టెంబర్ 15న ఆయన బాధ్యతలు స్వీకరించారు.  మహేశ్ కుమార్ గౌడ్ కు జెండాను ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. PCC చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మహేశ్ కు సూచించారు. టీపీసీసీ ఛైర్మన్ మహేశ్ కుమార్ గౌడ్ గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చారు.

Also Read :- తెలంగాణ అమరవీరులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివాళులు

 అంతక ముందు తన ఛాంబర్ లో నిర్వహించిన పూజల్లో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాసేపట్లో ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, కార్యకర్తలను ఉద్దేశించి మట్లాడనున్నారు. సభకు పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.