మరో నాలుగు రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా అన్ని జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా
భారత్ తో వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. పటిష్టమైన భారత్ ని స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమనే విషయం ఆసీస్ కి బాగా తెలుసు.
ఇందులో భాగంగా భారత్ ని ఓడించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే ఆసీస్ కి మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆసీస్ బిగ్ స్కెచ్ ఏంటి..? ఈ డూప్లికేట్ అశ్విన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 8 ఆదివారం.. వరల్డ్ కప్ లో ఫేవరేట్ జట్లయిన భారత్, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ని ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చెన్నైలో గ్రౌండ్ అంటే భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేరేగుతాడని ఆసీస్ ముందుగానే పసిగట్టింది. అశ్విన్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అచ్చం అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ని పోలి ఉన్న మహేష్ పితియాను నెట్ బౌలర్ గా నియమించుకోవాలని ప్లాన్ వేసింది. కానీ ఈ ఆఫర్ ని పితియా రిజెక్ట్ చేయడంతో ఆసీస్ ప్లాన్ బెడిసి కొట్టింది.
బరోడాకు చెందిన ఆఫ్ స్పిన్నర్ మహేష్ పితియా అచ్చం అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ని కలిగి ఉంటాడు. బరోడాకు చెందిన ఈ 21 ఒక్క ఏళ్ళ స్పిన్నర్..తన బౌలింగ్ కోచ్ S అరవింద్‌తో సంప్రదించిన తర్వాత ఈ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఇతర కమిట్‌మెంట్‌ల కంటే దేశీయ సీజన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు.
“ఇది ఖచ్చితంగా అద్భుతమైన ఆఫర్, అయితే వచ్చే నెలలో ప్రారంభమయ్యే దేశీయ సీజన్ కోసం బరోడా సెటప్‌లో నేను కూడా భాగమే. కాబట్టి, నేను దాని గురించి ఆలోచించాను, మా కోచ్‌తో మాట్లాడాను మరియు నేను ఈసారి క్యాంప్‌లో చేరడం సాధ్యం కాదని వారికి తెలియజేశాను, ”అని పిథియా స్పోర్ట్‌స్టార్‌తో అన్నారు. మొత్తానికి ఆసీస్ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అయ్యేసరికి కంగారులకు చెన్నైలో కంగారూ తప్పేలా కనిపించడం లేదు.