జనవరి 26 నుంచి బ్లాక్ స్థాయిలో పాదయాత్రలు

జనవరి 26 నుంచి బ్లాక్ స్థాయిలో పాదయాత్రలు

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితిపై  పార్టీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.  సీనియర్లను కోఆర్డినేట్ చేసే పనిలో AICC సెక్రటరీ బోసు రాజు ఉన్నారన్నారు. సీనియర్లకు ఫోన్ చేసి AICC  ఆదేశాలను వివరిస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 నుంచి బ్లాక్ స్థాయిలో పాదయాత్రలు చేసుకోవాలని AICC తెలిపినట్లు చెప్పారు. 2 నెలల పాటు పాదయాత్ర చేయాలని AICC ఆదేశించిందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.  ఈ పాదయాత్రల్లో పార్టీ నిర్ణయించే తేదీల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా పాల్గొంటారని  మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. చివరి రోజు హైదరాబాద్ లో జరిగే పాదయాత్రలో రేవంత్, భట్టి పాల్గొంటారని చెప్పారు. 

మరోవైపు రేపు (బుధవారం) బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే పార్టీలోని అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు రేపటి మీటింగ్ కు వెళ్లాలా వద్దా... అనే ఆలోచనలో పడ్డారు. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి  అసమ్మతి నేతలతో లీడర్లతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో  పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు.  ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని... బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దని నిర్దేశించారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు సీనియర్లెవరూ అటెండ్ కాకపోవడాన్ని అందుకు సంకేతంగా రాజకీయ పరిశీలకులు చూపుతున్నారు.