కండ్లద్దాలిచ్చినం.. కారు గుర్తుకు ఓటెయ్యండి : మంత్రి సబిత

కండ్లద్దాలిచ్చినం.. కారు గుర్తుకు ఓటెయ్యండి : మంత్రి సబిత

బడంగ్ పేట్,వెలుగు :  ఓటు దక్కించుకోవాలే.. ఎట్లైన గెలవాలే.. ఇదే టార్గెట్ గా అధికార బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సర్కార్ పథకాలను తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కంటి వెలుగు పథకాన్ని తన ఓటు కోసం ప్రచారం చేసుకుంటున్నారు.

నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కంటి వెలుగు ప్రోగ్రామ్ లో భాగంగా సేకరించిన లబ్ధిదారుల వివరాల డాటా తీసుకుని సోషల్ మీడియా ద్వారా ఇలా ఓటు అడుగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ మెసేజ్ లు పంపి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలో పలువురికి ఇలాంటి మెసేజ్ లు వెళ్లాయి.దీంతో ప్రజాధనంతో చేపట్టిన పథకాలను తమ  పార్టీ ఎన్నికల  ప్రచారానికి వాడుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ALSO READ : మెదక్​లో టఫ్​ ఫైట్​.. హ్యాట్రిక్​ కోసం ఒకరు.. అరంగేట్రానికి మరొకరు!