చేవెళ్ల, వెలుగు : చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్లలో శనివారం ప్రజాఆశీర్వాద సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. చేవెళ్లలో సెంటిమెంట్ ఉందని, ఇదే స్ఫూర్తితో కచ్చితంగా ఈ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని పేర్కొన్నారు గ్రేటర్‌కు దీటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును చేవెళ్ల నుంచి పార్లమెంట్ కు పంపుదామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, అరికేపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి,శంభీపూర్ రాజు, పొన్నాల లక్ష్మయ్య, యెగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, బాలమల్లు సభలో పాల్గొని మాట్లాడారు.