బడంగ్ పేట, వెలుగు: మహేశ్వరం సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గురువారం మీర్‌పేట కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వోదయ కాలనీలోని సాయిబాబా ఆలయంలో దర్శనం చేసుకుని మీర్‌పేట పాత గ్రామం వరకు పర్యటించారు. ఈ క్రమంలో ఓ ఇస్త్రీ బండి వద్ద బట్టలకు ఐరన్ చేసి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే స్థానికంగా ఉండే రోడ్లు, డ్రైనేజీని బాగు చేస్తామన్నారు.
ఇంటి ట్యాక్స్‌లు, నల్లా బిల్లులను సగం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఆయన వెంట కార్పొరేషన్ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహా, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా రవినాయక్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ALSO READ: టాటా టెక్నాలజీస్ .. ఐపీఓ ధర రూ. 500