ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయం : సీతక్క

ములుగు/తాడ్వాయి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయమని మహిళా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ములుగు మండలం రాంచంద్రాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ దొంతి ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే సీతక్క పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. 

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో కిసాన్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, బీసీ సెల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవి, మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్‌‌‌‌‌‌‌‌పాషా, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి పాల్గొన్నారు. అలాగే తాడ్వాయి మండలం కాల్వపల్లి సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మాదిరెడ్డి అరుణ సంపత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరడంతో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.