హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో మాత్రమే మహిళలకు న్యాయం జరుగుతుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. గోషామహల్ వంటి సీటులో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసి కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి బరిలో నిలిచానన్నారు.
కాంగ్రెస్ లో చాలా మంది నేతలకు పదవులు ఇస్తున్నారని.. అందులో ఓడిపోయిన నేతలూ ఉన్నారన్నారు. తనకు కూడా అవకాశం ఇవ్వాలని ఆమె పార్టీ అధిష్టానాన్ని కోరారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని.. పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.