మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కంపెనీ అమ్మకాల్లో మరో మైలురాయిని దాటింది. కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఐదు సంవత్సరాల తర్వాత తన చిరకాల ప్రత్యర్థి కంపెనీ అయిన టాటా మోటార్స్ సేల్స్ ను మించి కార్ల అమ్మకాలు చేసింది.
కంపెనీ సేల్స్ రిపోర్టు ప్రకారం..2024 సెప్టెంబర్ లో ఏకంగా 51వేల 062 కార్లను అమ్మి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ అమ్మకాల్లో1528 యూనిట్లను ఎక్స్ పోర్టు చేసింది. అంతేకాదు అమ్మకాల్లో 24 శాతం ఇయర్ వైజ్ గ్రోత్ సాధించింది. ఇక అనుకోనివిధంగా టాటామోటార్స్ అమ్మకాలు పడిపోయాయి.
Also Read :- 90వేల మంది తొలగింపుకు సిద్ధం
2024 సెప్టెంబర్ లో టాటామోటార్స్ అమ్మకాలు బాగా పడిపోయాయి. కేవలం టాటామోటార్స్ 41వేల 063 మాత్రమే కార్లను మాత్రమే విక్రయించింది. ఇక ఇయర్ వైజ్ గ్రోత్ లో 8శాతం అమ్మకాలు పడిపోయాయి.
మహింద్రా కార్లలో SUVలకు బాగా డిమాండ్ ఉంది. దీంతో పాటు మహింద్రా పాపులర్ మోడల్స్ అయిన బొలెరో, స్కార్పియో ఎన్, XUV700 ల అమ్మకాలు బాగా పెరిగాయి. అయితే అమ్మకాల్లో ఎక్కువ షేర్ XUV 3XO మోడల్ కార్లదే. ఇక టాటా మోటార్స్ వెనకబడిపోవడానికి కారణం సీజన్ ఫ్యాక్టర్స్, కంపెనీ మోడళ్లపై కస్టమర్ల ఆసక్తి తగ్గడమే.