మహీంద్రా జియో @రూ. 7.52 లక్షలు

మహీంద్రా జియో @రూ. 7.52 లక్షలు

ఆటోమేకర్​ మహీంద్రా జియో పేరుతో ఎలక్ట్రిక్ కమర్షియల్​ స్మాల్​ వెహికల్​ను (ఎస్​సీవీ) లాంచ్​ చేసింది. అర్బన్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చడానికి దీనిని రూపొందించింది. ఈ బండిలోని 21.3 కిలోవాట్​అవర్ ​లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఉంటుంది.

మోటార్​ 30 కిలోవాట్ల శక్తిని, 114 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేస్తుంది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.  పేలోడ్ సామర్థ్యం 765 కిలోల వరకు వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్​చేస్తే 160 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  మహీంద్రా జియో ధర రూ. 7.52 లక్షలు (ఎక్స్-షోరూమ్).