కొత్త బొలెరో ట్రక్స్​ లాంచ్

హైదరాబాద్, వెలుగు:  మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్‌‌‌‌ ఎం), తన బొలెరో ఎంఎఎక్స్‌‌‌‌ఎక్స్‌‌‌‌ సిరీస్​ పికప్​ట్రక్స్​ను హైదరాబాద్​లో మంగళవారం లాంచ్​ చేసింది.  రూ. వీటి ధరలు రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షల వరకు ఉంటాయి.  బొలెరో ఎంఎఎక్స్‌‌‌‌ఎక్స్‌‌‌‌ ట్రక్స్​ హెచ్‌‌‌‌డీ సిరీస్‌‌‌‌ ( 2.0ఎల్, 1.7ఎల్‌‌‌‌,  1.7, 1.3 ఎల్​)  సిటీ సిరీస్‌‌‌‌ (1.3, 1.4, 1.5 ఎల్​)లలో లభిస్తాయి. 

వీటి పేలోడ్​ కెపాసిటీ 1.3 టన్నుల నుంచి రెండు టన్నుల వరకు ఉంటుంది. కార్గో బెడ్​లెంత్​ 3050 ఎంఎం వరకు ఉంటుంది. ఈ ట్రక్స్​లో ఎం2డీఐ 4 సిలిండర్​డీజిల్​ ఇంజన్​ 80 హెచ్​పీని, 200 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. ఐదు గేర్ల సిస్టమ్​ ఉంటుంది. 

ఎత్తు- సర్దుబాటు డ్రైవర్ సీటు, డిజిటల్ ఇన్​స్ట్రమెంట్ క్లస్టర్, 20,000 కిలోమీటర్ల సర్వీస్ ఇంటర్వెల్, ఎల్​ఈడీ టెయిల్-ల్యాంప్‌‌‌‌లు, రూట్ ప్లానింగ్, ఖర్చుల నిర్వహణ, వెహికల్​ ట్రాకింగ్, హీత్ మానిటరింగ్, జియో ఫెన్సింగ్‌‌‌‌తో సహా 50కి పైగా ఫీచర్లు, ఐమాక్స్​ కనెక్టెడ్ సొల్యూషన్‌‌‌‌, హెల్త్​ మానిటరింగ్​ వంటివి వీటిలోని ప్రత్యేకతలు.