రెండేళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా స్క్రార్పియో N మోడల్ కార్లు..అప్పటినుంచి ప్రజాదరణ పొందుతూనే ఉంది. అయితే ఇప్పుడు మహీంద్రా స్క్రార్పియో N 2023 మోడళ్లపై అద్బుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ కార్ల కొనుగోలుపై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ కార్లు ఆఫర్లు, డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం.
స్కార్పియో N టాప్ ఆఫ్ ది లైన్ Z8, Z8L డీజిల్ 4x4 వెర్షన్ల కోసం డిస్కౌంట్ ఇస్తోంది. వీటిలో 7సీటర్ల మోడళ్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లపై 1లక్ష రూపాయల వరకు ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే Z8, Z8L డీజిల్ 4x2AT వేరియంట్లు, 6,7 సీటర్ల కు మాత్రం రూ. 60వేల నగదు డిస్కౌంట్ లభిస్తుంది.
అదేవిధంగా 6,7 సీటర్ కాన్ఫిగరేషన్ లలో లభించే z8, Z8L పెట్రోల్ AT వేరియంట్లకు కూడా రూ. 60వేల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ అందించబడుతోంది.అయితే ఏ వేరియంట్ పైనా ఎక్ఛేంజ్ బోనస్ లు లేదా కార్పొరేట్ ఆఫర్లు లేవు.
మహీంద్రా స్కార్పియో N బెస్ట్ ఫర్మార్మెన్స్ తో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇది రెండు డైనమిక్ ఇంజన్ ఎంపికల్లో లభిస్తోంది. దీని పవర్ ఫుల్ 203bhp, 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ లేదా ధృడమైన 175bhp, 2.2లీటర్ల డీజిల్ ఇంజన్ లను ఎంచుకున్నట్లయితే..ఇవి 6స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లను కలిగి ఉన్నాయి. అయితే స్టాండర్డ్ స్కార్పియో N రియర్ వీల్ డ్రైవ్ తో వస్తోంది. డీజిల్ వేరియంట్ అప్ గ్రేడ్ చేయబడిన ట్రాక్షన్, నియంత్రణ కోసం ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది.