పెరగనున్న మహీంద్రా బండ్ల ధరలు

పెరగనున్న మహీంద్రా బండ్ల ధరలు

న్యూఢిల్లీ: ధరలను పెంచుతున్న ఆటోమొబైల్​ కంపెనీల లిస్టులో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా చేరింది. వచ్చే నెల నుంచి తమ వెహికల్స్​ ధరలను మూడు శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. ఇన్​పుట్ ​ఖర్చులు, కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

మోడల్​ను బట్టి బండి ధర పెరుగుతుంది. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, కియా ఇండియా, బీఎమ్‌‌‌‌డబ్ల్యూ, హోండా కార్స్ ఇండియాలు వచ్చే నెల నుండి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.